![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -80 లో..... కాంచనకి దీప ఇండైరెక్ట్ గా.. ఒక భర్త తన భార్యని మోసం చేసి ఒకరికి తెలియకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాడని చెప్తుంది. అలాంటి వాడిని జైలుకి పంపాలి.. నువ్వు కాబట్టి తట్టుకొని నిలబడుతున్నావ్.. అదే నేనైతే చనిపోయేదాన్ని అని కాంచన అంటుంది. అయిన వాడెవడు పేరు చెప్పు.. మా అయనకి చెప్పి వాడికి బుద్ది వచ్చేలా చేస్తానని కాంచన అంటుంది. ఇప్పుడు చెప్పి మీ ప్రాణాలు తియ్యలేనని దీప మనసులో అనుకుంటుంది. ఏదో ఒకటి చెప్పి కాంచనని డైవర్ట్ చేస్తుంది.
మరొకవైపు శివన్నారాయణ ఇంటికి తన బంధువులు వచ్చి.. పెళ్లి పత్రిక ఇస్తారు. తప్పకుండా వస్తామని శివన్నారాయణ చెప్తాడు. ఆ తర్వాత కోపంగా మన ఇంట్లో కూడా ఒక పెళ్లి కావల్సిన అమ్మాయి ఉందన్న విషయం మర్చిపోయారా అని పారిజాతం అంటుంది. జ్యోత్స్న పెళ్లి గురించా అని శివన్నారాయణ అంటాడు. వచ్చే ముహూర్తంలో పెళ్లి చేస్తానన్నారు. ఇప్పుడు ముహూర్తలు వచ్చాయి వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టండని పారిజాతం అంటుంది. అవునని సుమిత్ర అంటుంది. అయితే రేపే వాళ్ళని ఇంటికి పిలుద్దామని దశరథ్ అంటాడు. మనమే వెళ్లి సంబంధం మాట్లాడాలని సుమిత్ర అంటుంది. మరొకవైపు శ్రీధర్ తో ఉన్న ఆవిడ ఎవరు డాడ్ ని అడగాలా వద్దా అని స్వప్న ఆలోచిస్తుంది. అప్పుడే శ్రీధర్ కావేరీలు గుడి నుండి ఇంటికి వస్తారు. స్వప్నకి చాక్లెట్ ఇస్తాడు శ్రీధర్. కొబ్బరి బొండ తేవాల్సిందని స్వప్న అనగానే.. నేను కాంచనకి కొబ్బరి బొండం ఇవ్వడం స్వప్న చూసిందా అని శ్రీధర్ అనుకుంటాడు. ఆ తర్వాత అన్ని విషయాలు తెలుసుకొని అడగాలని స్వప్న అనుకుంటుంది.
మరొకవైపు కాంచనతో పెళ్లి విషయం మాట్లాడడానికి శివన్నారాయణ, పారిజాతం వస్తారు. భోజనం చేస్తూ వంటలు బాగున్నాయని పారిజాతం అనగానే.. నాకు బాగోలేదని దీపతో కార్తిక్ చెప్పాడంట. దీప వచ్చి హెల్ప్ చేసిందని కాంచన అంటుంది. కార్తీక్ కి జ్యోత్స్న కి పెళ్లి చెయ్యాలి.. ముహూర్తం పెట్టించాలని కార్తీక్ కి చెప్పమని పారిజాతం అంటుంది. నువు టెన్షన్ పడకు పిన్ని జ్యోత్స్ననే నా ఇంటికి కోడలు అని కాంచన అంటుంది. మరొకవైపు దీపకి నర్సింహా ఫోన్ చేసి.. శౌర్యని ఎప్పుడు ఇస్తున్నావని అడుగుతాడు. ఇవ్వనంటావా? శౌర్యా నీకు పుట్టలేదని చెప్పమని నరసింహా అనగానే.. దీప బాధపడుతుంది. అపుడే కార్తీక్ వస్తాడు. ఏమైందని అడుగగా కార్తీక్ బాబుకి విషయం చెప్తే పోలీస్ స్టేషన్ అంటాడని సైలెంట్ గా ఉంటుంది. ఏం లేదు నా సమస్య నేను పరిష్కారించుకుంటానని దీప అంటుంది. శౌర్య జాగ్రత్త.. తెలియాకుండానే చాల క్లోజ్ అయిపోయిందని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |